ప్రజాశక్తి-రొద్దం (అనంతపురం) : రూ.62 లక్షలతో సి సి రోడ్డు కు నిధులు మంజూరయ్యాయి. మండలంలోని కందుకూర్లపల్లి నుండి రొద్దం నుంచి హిందూపురం వెళ్లే రహదారి వరకు దాదాపు కిలోమీటర్ వరకు 62 లక్షలు రూపాయలతో సీసీ రోడ్డు శాంక్షన్ అయినందున మంత్రి సవిత ఆదేశాల మేరకు సోమవారం రోడ్డును మండల టిడిపి నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కందుకూర్లపల్లి, చిన్నకోడిపల్లి గ్రామాల ప్రజలు తమ 30 ఏళ్ల నాటి కలను నెరవేరుస్తున్నందుకు మంత్రి సవితకు మండల టిడిపి నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవనాయుడు, చంద్రమౌళి, చిన్నప్పయ్య, అశ్వార్థనారాయణ, పాతర్లపల్లి నర్సింహులు, మోపార్లపల్లి, చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
