సమస్యలను తెలుసుకుంటున్న సిపిఎం బృందం
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : సిపిఎం చేపట్టిన ప్రజాచైతన్య యాల్రో భాగంగా పట్టణంలోని గాంధీనగర్, సుందరయ్య కాలనిలో సిపిఎం బృందం గురువారం పర్యటించింది. స్థానికులతో మాట్లాడి సమ్యలను తెలుసుకున్నారు. తమ సర్వీసు ఎస్సీ సబ్‌ప్లాన్ కింద నమోదైనా బిల్లు మాత్రం రూ.73,125 వచ్చిందని గాంధీ నగర్‌కు చెందిన గంటేలపల్లి అమరేశ్వరరావు వాపోయాడు. ఈ ప్రాంతంలో రేషన్ బియ్యం సరిగా అందడం లేదని మరికొందరు చెప్పారు. వీధిలైట్లు, సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నామని సుందరయ్య కాలనీ నివాసితులు వాపోయారు. 13వ తేదీ వచ్చినా రేషన్ బియ్యం ఇంకా ఇవ్వలేదన్నారు. ఎవరైనా అడిగితే.. దిక్కున్న చోట చెప్పుకోండి.. అంటున్నారని ఆవేదనకు గురయ్యారు. విద్యుత్ ప్రధాన స్తంభాలు ఇళ్లమైన ఉన్నాయని, వేరేచోటకు మార్చాలన్నారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శవర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ ఈ సమస్యలతోపాటు కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో సిపిఎం మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు, కాలనీవాసులు గోవిందు మస్తాన్‌వలి, షేక్ సైదా, వెంకటరత్నం, షేక్ సిలర్, భూలక్ష్మి, బిబిలి పాల్గొన్నారు.
కరెంటు బిల్లును చూపుతున్న బాధితులు
