ఆటోను ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు – ఇద్దరికి స్వల్పగాయాలు

May 17,2024 14:29 #accident, #injured, #RTC BUS, #two members

ప్రజాశక్తి-ఉప్పలపాడు (పల్నాడు జిల్లా) : ఆగి ఉన్న ఆటోను ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో ఇద్దరికి స్వల్ప గాయాలైన ఘటన శుక్రవారం పల్నాడులో జరిగింది. విజయవాడ నుండి వినుకొండ వైపు వెళుతున్న ఆర్‌టిసి బస్సు మరో వాహనాన్ని దాటి వెళ్లే క్రమంలో వేగంగా వెళుతూ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామానికి చెందిన ప్రదీప్‌, అల్లూరివారిపాలెం గ్రామానికి చెందిన శేఖర్‌ లకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనం ద్వారా లింగంగుంట్ల గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

➡️