దుర్గంధభరితంగా ఆర్టీసీ బస్టాండు ఆవరణం

Jun 8,2024 13:55 #bad smell, #premises, #RTC bus stand

ప్రజాశక్తి- కలకడ (రాయచోటి-అన్నమయ్య) : ఆర్టీసీ బస్టాండు దుర్గంధభరితంగా మారుతున్నది. మండల కేంద్రమైన కలకడ ఆర్టీసీ బస్టాండ్‌ దుర్గంధభరితంగా మారి పలు రకాల వ్యాధులకు దోహదపడుతున్నట్లు పలువురు వాపోతున్నారు. కలకడ ఆర్‌టిసి బస్టాండ్‌ మాత్రం రోగాలకు నిలయంగా మారి చెత్తాచెదారంతో నిండి ఉంది. బస్టాండు సమీపంలో ఉన్న మలమూత్రశాల శిధిలావస్థకు చేరడం ప్రయాణికులకు పలు ఇబ్బందికరంగా మారుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో పనిచేస్తున్న కండక్టర్లు మలమూత్రశాలలకు వెళ్లాలంటే స్థానిక పోలీస్‌ స్టేషన్ను ఆశ్రయించవలసిన దుస్థితి ఏర్పడుతున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఏర్పాటు చేసినప్పుడు మలమూత్రశాలలు ఏర్పాటు చేసి ఒక వ్యక్తిని వాటి పరిరక్షణ చేసేందుకు గతంలో ఉంచారన్నట్లు పలువురు చెప్పారు. ప్రస్తుతం మలమూత్రశాలలో శిథిలావస్థకు చేరడమే కాకుండా అటువైపు వెళ్లాలన్న భయంకరంగా ఉన్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌ ఆవరణంలో అద్దెకు గదులు ఇచ్చి వారి వద్ద నుండి వేలకు వేల రూపాయలు బాడుగలు వసూలు చేస్తూ మలమూత్రశాలలో ఏర్పాటుకు నోచుకోకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.

➡️