దుర్గంధ భరింతగా ఆర్‌టిసి బస్టాండ్‌ ఆవరణం

ప్రజాశక్తి-కలకడ మండల కేంద్రమైన కలకడ ఆర్‌టిసి బస్టాండ్‌ దుర్గంధ భరితంగా మారి అసౌకర్యంగా ఉందని స్థానికులు, ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌ ప్రాంగణమంతా చెత్తాచెదారం, వ్యర్థాలతో నిండి రోగాలకు నిలయంగా మారిందని పేర్కొన్నారు. బస్టాండ్‌ సమీపంలో ఉన్న మరుగుదొడ్లు శిధిలావస్థకు చేరడంతో ల ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతున్నట్లు అనేకమంది వాపోతున్నారు. కండక్టర్లు మలమూత్రశాలలకు వెళ్లాలంటే స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించవలసిన దుస్థితి ఏర్పడుత ున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. గతంలో బస్టాండ్‌లో మరుగుదొడ్లు నిర్వ హణ బాగుండేదని ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాథ ుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్‌ ఆవరణంలో అద్దెకు గదులు ఇచ్చి వారి వద్ద నుంచి వేలకు వేలు బాడుగలు వసూలు చేస్తూ మల మూత్ర శాలలో ఏర్పాటుకు నోచుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రాంగణంలో కంకర తేలి ఉండటంతో బస్సులు, పాదచారులు వెళ్లడానికి వీలు లేకుండా ఉందని పేర్కొన్నారు. కంకర తేలిన బస్టాండ్‌ లో ప్రమాదలు జరిగేందుకు అవకాశాలు కూడా ఉన్నాయంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బస్టాండ్‌ గదుల ద్వారా ఆర్‌టిసికి లాభం ఉన్నప్పటికీ ఏమాత్రం అభివద్ధికి నోచుకోవడం లేదని విమర్శించారు. బస్టాండ్‌ ఎదుట తోపుడుబండ్లు, ఆటోలు పార్కింగ్‌ చేసి ఉండటంతో బస్టాండ్‌ లోనికి బస్సులు వెళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా మారిందని అన్నారు. ప్రయివేట్‌ బస్సులు, వాహనాలు బస్టాండ్‌ ఆవరణంలోకి వస్తూ పోతూ ఉన్న అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. బస్టాండ్‌లో కంట్రోలర్‌ లేకపో వడం విడ్డూరంగా ఉంద ని దీని ద్వారా ప్రయివేట్‌ వాహనాలు విచ్చల విడిగా పెరగడమే కాకుండా ఆర్‌టిఒకు ఆర్థికంగా గండి పడుతుందని తెలిపారు. ఇప్ప టికైనా ఆర్‌టిసి అధికారులు స్పందించి బస్టాండ్‌ ఆవరణాన్ని ఆధునీకరిం చాలని పేర్కొన్నారు. మరుగుదొడ్లను ఏర్పాటు చేసి ప్రయా ణీలకు, బస్టాండ్‌ ఆవరణంలో ఆటోలు, దుకాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

➡️