సురక్షిత ప్రయాణమే ఆర్‌టిసి లక్ష్యం

ప్రజా శక్తి రాయచోటి ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్‌టిసి ముఖ్య ఉద్దేశమని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయచోటి ఆర్‌టిసి బస్టాండ్‌లో 9 నూతన బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్‌టిసి లక్ష్యమన్నారు. రాబోయే రోజులలో ప్రయాణికుల కోసం మరిన్ని నూతన బస్సులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రయాణికుల రద్దీని దష్టిలో ఉంచుకొని నూతన బస్సులు కొనుగోలు చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని పేర్కొన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ఐదేళ్లలో ఎపిఎస్‌ఆర్‌టిసి పూర్తిగా నిర్వీర్యమైందని తెలిపారు. రాబోయే కాలంలో ఆర్‌టిసి ప్రక్షాళన చేసి ప్రయాణికులకు నాణ్యమైన సేవల అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని నూతన ఆర్‌టిసి బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఈ సందర్భంగా రాయచోటి నుంచి విజయవాడకు, మదనపల్లి నుంచి విజయవాడకు సూపర్‌ లగ్జరీ బస్సు, రాయచోటి నుంచి తిరుమలకు డైరెక్టుగా రెండు సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లను, పీలేరు నుంచి తిరుపతికి మూడు బస్సులు అందులో ఒకటి ఆర్డినరీ రెండు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, రాయచోటి నుంచి వేంపల్లికు ఒక ఎక్స్‌ప్రెస్‌ బస్సులను మంత్రి ప్రారంభించారు. బ్యాంకును ప్రారంభించిన మంత్రి : పట్టణంలోని సుండుపల్లె రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫినో పేమెంట్‌ బ్యాంకును మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీనో పేమెంట్‌ బ్యాంకు వారు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి దినదినాభివ ద్ధి చెందాలన్నారు. పట్టణంలో అర్హులైన వారందరికీ విరివిగా రుణాలు ఇచ్చి ఖాతాదారుల అభివద్ధికి కషి చేయాలన్నారు. ఫినో బ్యాంకు మేనేజర్‌ సిబ్బంది మంత్రికి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.

➡️