విషాదం నింపిన ఈత సరదా

ఈత సరదా రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. సెలవు రోజు కావ డంతో ముగ్గురు చిన్నారులు ఈత కోసం వెళ్లి నీట మునిగి మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని కెసి కెనాల్‌, పెన్నా నది ప్రాంతాల్లో చోటు చేసుకుంది. వివరాలు..కెసి కాలువలో పడి ఇద్దరు.. ప్రజాశక్తి -మైదుకూరు(చాపాడు) : మున్సిపాలిటీ పరిధిలోని కెసి కెనాల్‌లో ఇద్దరు పిల్లల మంగళవారం గల్లంతు అయ్యారు. రాత్రి ఒకరూ, బుధవారం ఒకరి మతదేహలు అభ్యమయ్యాయి. మైదుకూరు మున్సిపాలిటీ శాంతి నగర్‌కు చెందిన మద్దుం కుమారులు యాసిన్‌(10), రఫీ(9) మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి కనిపించలేదు. బంధువుల ఇంటికి వెళ్లి ఉంటారని తల్లిదండ్రులు వెతికారు. ఎక్కడ కనిపించకపోవడంతో అనుమానంతో కెసి కెనాల్‌ వెంబడి గాలింపు చేపట్టారు. కెసి కెనాల్‌ గట్టుపై పిల్లల బట్టలు ఉండడంతో కెనాల్‌ వెంబడి గాలింపు చేపట్టారు. బద్వేల్‌ రోడ్డులో కెనాల్‌ వద్ద యాసిన్‌(10) మతదేహాన్ని కనుగొన్నారు. రఫీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన రాత్రి కావడంతో గుర్తించలేకపోయారు. బుధవారం ఉదయం బద్వేల్‌ రోడ్డులో మతదేహాన్ని గుర్తించారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మతదేహాలను గాలింపు చేపట్టి వెలికి తీశారు. ఇద్దరు పిల్లలు మతితో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. కాలనీలో విషాదఛాయలు అలుబుకున్నాయి. పెన్నా నదిలో పడి మరో బాలుడు.. సిద్దవటం : సిద్దవటంలోని హైవే వంతెన ప్రాంతంలోని పెన్నా నదిలో బుధవారం అన్నమయ్య జిల్లా పుల్లంపేటకు చెందిన ఇస్మాయిల్‌ (6) బాలుడు ప్రమాదశాత్తు నీట మునిగి మతి చెందాడు. తన బంధువులతో కలసి విహారయాత్రకు సిద్దవటంలోని పెన్నానదిలోకి వెళ్లాడు. సరదాగా నీటిలో ఆడుకుంటుండగా మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న ఒంటిమిట్ట సిఐ కష్ణంరాజు నాయక్‌ సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో బాలుడిని బయటికి తీసుకొచ్చారు. అప్పటికే అతను మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

➡️