ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : గత నెల 19వ తారీఖున ఆన్‌లైన్‌లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎడ్యుకేషనల్ ఎఫిఫని మెరిట్ టెస్ట్ (ఈ. ఈ.యం. టి.) మెయిన్స్ పరీక్షలో పందిళ్ళపల్లి హైస్కూల్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థి సజ్జా దివ్యశ్రీ కి వేటపాలెం మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మెడబలిమి శేఖరరావు అధ్యక్షతన మంగళవారం అభినందన సభ నిర్వహించారు. శేఖరరావు మాట్లాడుతూ … నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని, ఈ సంస్థ 2012 వ సంవత్సరం నుండి యస్. సి. ఈ. ఆర్. టి సహకారంతో గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏడో తరగతి, పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులను చిన్నతనం నుండే ఆన్లైన్ డిజిటల్ పోటీ పరీక్షల్లో సిద్ధం చేసేందుకు ప్రిలిమ్స్ స్థాయిలోనూ, మెయిన్స్ స్థాయిలోనూ పోటీ పరీక్షలను నిర్వహిస్తూ, విద్యార్థులలో కమ్యూనికేషన్, సమస్య పరిష్కారం, సమయ నిర్వహణ వంటి నైపుణ్యాలను పెంపొందించడమే ఈ సంస్థ లక్ష్యమని తెలిపారు. మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన సజ్జా దివ్యశ్రీ కి మెమెంటో, సర్టిఫికేటు, బహుమతిని మండల విద్యాధికారి చేతుల మీదుగా త్వరలో అందజేయబడుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు చెరుకూరి రాంబాబు, బండ్ల భారతి, ఓల్డ్ స్టూడెంట్ సొసైటీ అధ్యక్షులు ఊటుకూరి శ్రీమన్నారాయణ, కార్యదర్శి దశరథ రామిరెడ్డి, జాయింట్ సెక్రటరీ కడెం రాముడు, పదవ తరగతి టీచర్స్ గుంటూరు శివశంకర్, ఉమ్మిటి. వేణుగోపాలరావు, బత్తుల నీలిమ, చెరుకూరి భవానీ దేవి, కొండేపి హరీష్ కుమార్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అభినందించారు.
ఈఈయంటి మెయిన్స్ పరీక్షలో సజ్జా దివ్యశ్రీకి మండల ప్రథమ స్థానం
