ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలో శనివారం డిప్యూటీ తాసిల్దార్ బాలమ్మకు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మాట్లాడుతూ … దౌర్జన్యంగా ఆక్రమణలకు గురైన ఎస్సీ,ఎస్టీల భూముల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని . దౌర్జన్యంగా అక్రమనలకు గురైన ఎస్సీ,ఎస్టీల భూములను కాపాడాలని బాధితులతో కలిసి సాకే హరి వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో సాకే హరి మాట్లాడుతూ.. మండల పరిధిలో అనేక గ్రామాల్లో దళిత,గిరిజనులకు చెందిన భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోక మూలన పడ్డాయన్నారు.హరిజన లక్ష్మమ్మకు ఆత్మకూరు పొలం సర్వే నం 547-7లో 4.24 ఎకరాలు భూమి భర్త మరణాంతరం పట్టా, పాస్ పుస్తకాలతో పాటు బ్యాంక్ లోన్ తీసుకోవడం జరిగిందన్నారు. నలుగురు కుమారులకు ఇదే జీవనాధారమైన భూమికి హద్దులు చూపించాలేదని మండిపడ్డారు.సర్వే కోసం చలాన కడితే కాలం చెల్లిపోయిందని మరీ కట్టాలనడం ఏమిటని ప్రశ్నించారు.కొన్ని చోట్ల సాగులో దళితులుంటే రాజకీయ,ధన బలంతో రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించుకొని భూమికి సంబందించి ఆధారాలు తీసుకొని రావాలని బెదిరింపులకు దిగుతున్నారు.అధికారికంగా ఎస్సీ,ఎస్టీలకు భూ పంపిణీ చేసినప్పటికీ సాగులోకి రాకుండా అడ్డుకోవడం జరుగుతోందన్నారు. భూమి కోసం రెవెన్యూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన ప్రయోజనం లేదన్నారు.ఎస్సీ ఎస్టీల్లోని పేదరికం,అమాయకత్వా న్ని ఆసరాగా చేసుకుని కోర్టుల చుట్టూ తిప్పుతూ కాలయాపన చేయడం బాధాకరమన్నారు. ఇప్పటికే దళితులకు చెందిన వందల ఎకరాలు భూ కబ్జాదారుల చేతుల్లో బందీగా మిగిలిపోయాయని ఆవేదన చెందారు.అన్యక్రాంతమైన భూములను తిరిగి పొందడానికి భూ బాధితులతో కలసి ఉద్యమిస్తమన్నారు. ఈ కార్యక్రమంలో జే,ఏ,సీ నాయకులు మురళి,రామకఅష్ణ, జింక వెంకటేష్, రామసుబ్బయ్య, బాబు బాధితులు లక్ష్మమ్మ, వెంకటేష్, రమేష్, ఓబుళప్ప పాల్గొన్నారు.
