ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : నగరంలో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని, మాంసపు విక్రయాలు చేయరాదని నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కబేళాలు, మాంసపు అమ్మకపు దుకాణాలు ఆదివారం రోజున మూసివేయాలని, హోటళ్ళు, రెస్టారెంట్లలలో సైతం మాంసపు పదార్థాలు విక్రయించకూడదని పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే, వారి వ్యాపార ట్రేడ్ లైసెన్స్ రద్దు, భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావున వ్యాపారులు సహకరించాలని ప్రజారోగ్య అధికారి కోరారు.
