రేషన్‌షాపుల ద్వారా వంట నూనె విక్రయాలు

Oct 11,2024 21:10

 ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌  : పేదలకు చౌక ధరల దుకాణం ద్వారా ఆయిల్‌ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా దశలవారీగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. పేదవాళ్లంతా మూడు పూటలా పుష్టిగా కడుపు నింపుకునేలా ప్రభుత్వం బియ్యంతో పాటు తక్కువ ధరకే పంచదార, ఆయిల్‌, కందిపప్పు అందిస్తుందన్నారు. గత వైసిపి పాలనలో బియ్యం తప్ప మరే ఇతర సరుకులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్‌ ద్వారా తక్కువ ధరకే సరుకులు అందించడం జరుగుతుందన్నారు. పామాయిల్‌, రిఫండ్‌ ఆయిల్‌ అందించడం జరుగు తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకుంటూ ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి మరోవైపు సంక్షేమం అమలు చేస్తూ ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అన్ని వర్గాలకు మంచి జరిగేలా అడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో జెసి శోబిక, టిడిపి నాయకులు పాల్గొన్నారు.కురుపాం : ప్రభుత్వ దుకాణాల్లో సరసమైన ధరలకు అందిస్తున్న పామాయిల్‌, రిఫైండ్‌ ఆయిల్‌ నూనెలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల కన్వీనర్‌ కెవి కొండయ్య అన్నారు. స్థానిక రావాడ జంక్షన్‌లో దుకాణం వద్ద రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పామాయిల్‌, ఆధార్‌ నూనెల అమ్మకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఒ మహేంద్ర, విఆర్‌ఎ ఈశ్వరరావు, టిడిపి నాయకులు రమేష్‌, సురేష్‌, శ్రీను, ఆనందరావు, గౌరీ తదితరులు పాల్గొన్నారు.

➡️