జాశక్తి – రాయచోటి టౌన్ తల్లికి వందనం ప్రతి విద్యార్థికీ ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు పవన్ నాయుడు అన్నారు. శుక్రవారం సంబేపల్లి మండల కేంద్రంలో జడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూనే మరోపక్క 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు సమయపాలన మార్చడం దుర్మార్గం అన్నారు. దీని ద్వారా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు పోవడానికి రవాణా సౌకర్యం లేక చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మనబడి మన భవిష్యత్తు పేరుతో పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేసి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. తల్లికి వందనం ఎలాంటి షరతులు లేకుండా ప్రతి విద్యార్థికీ అందేలా నిబంధనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం మండల నూతన కమిటీ పోరాటం చేయాలని కోరారు. అనంతరం సంబేపల్లి మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా చైతన్య, ఆనంద్ ఉపాధ్యక్షులుగా సమీర్, నాగరాజ్, వినరు, హరి నాయుడు, సహాయ కార్యదర్శిలు బాలనరసింహ, సంతోష్ కుమార్, నాగేంద్ర, చరణ్,సోహెల్ ఎన్నికయ్యారు.