పట్టుబడిన ట్రాక్టర్‌ఇసుక ట్రాక్టర్ సీజ్ ప్రజాశక్తి-కోవూరు:పెన్నా పరివాహక ప్రాంతమైన వేగూరు నుంచి బుదవారం తెల్లవారుజామున ఇసుకను అక్రమంగా తరలిస్తోన్న ట్రాక్టర్‌ను కోవూరు ఎస్‌ఐ రంగనాద్ గౌడ్ పట్టుకొని స్టేషన్‌కి తరలించారు. .అనుమతులు లేకుండా ఇసుక రవాణ చేస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని తెలిపారు.ఈ విషయంలో ఎంఎల్‌ఎ కూడా గట్టిగా ఉన్నారని తెలిపారు.ఇటీవల జరిపిన సమావేశంలో కూడా అక్రమ రవాణాను అరికట్టాలని తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
