ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

ప్రజాశక్తి-వేటపాలెం: వేటపాలెం బైపాస్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించి డ్రై వర్ల వద్ద అనుమతి పత్రాలు లేని ట్రాక్టర్లను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించే వారికి కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా ఎస్‌ఐ హెచ్చరించారు.

➡️