కందుకూరులో పడకేసిన పారిశుధ్యం

Jun 11,2024 19:57
కందుకూరులో పడకేసిన పారిశుధ్యం

కందుకూరు పేటలో పేరుకుపొయిన చెత్త
కందుకూరులో పడకేసిన పారిశుధ్యం
ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు పట్టణంలో పారిశుధ్య పరిస్థితలు అధ్వానంగా ఉన్నాయి. పట్టణంలోని గొందిలో చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. మురుగును తొలగించడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమీ లేవని ప్రజలు విమర్శిస్తున్నారు. కందుకూరు మున్సిపాలిటీలో ఇంటింటి చెత్త సేకరణ ప్రతిరోజు జరుగుతున్నప్పటికీ మున్సిపాలిటీ చెత్త కుండీలు నిండి రోడ్లపై చెత్త దొడ్లాడుతున్న మున్సిపల్‌ అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు. గతంలో చెత్తకుండీలు వద్ద చెత్త కనిపించిన ఫోటో పేపర్లో వస్తే అధికారులు అది అవమానంగా భావించి శుభ్రంగా పెట్టడానికి చర్యలు తీసుకున్నారు. ఉదయాన్నే క్లీన్‌ చేసినా చెత్త కుండీల వద్ద సాయంత్రానికి మళ్లీ చెత్త పడితే చూడడానికి అసహ్యంగా ఉంటుందని భావించిన అధికారులు రెండోసారి కూడా క్లీన్‌ చేయించే చర్యలు తీసుకున్నాను. ఆ పరిస్థితులు ఇప్పుడు కందుకూరులో కనిపించట్లేదు. కాలవలు పూడికతో నిండిపోయాయి. మురు గనీరు ప్రవహించకుండా అడ్డంకులు కలిగిస్తున్నాయి. దీంతో దోమల స్వైర విహారం కొనసాగుతోంది. కొత్తగా ఎంఎల్‌ఎగా ఎన్నికైన ఇంటూరి నాగేశ్వరరావు పారిశుధ్య పరిస్థితులపై ప్రత్యేక దష్టి పెట్టి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

➡️