మర్రిపూడిమాదిగపల్లె (ప్రకాశం) : మండల కేంద్రమైన మర్రిపూడి మాదిగపల్లెలో బుధవారం శానిటేషన్ కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా కాలనీలో సైడ్ ట్రైన్ లో చెత్తాచెదారం పేరుకుపోయి, ఎక్కడ మురుగు నీరు అక్కడే నిలువ చేరి దుర్వాసన కొడుతున్నప్పటికీ ఇటీవల కాలంలో మాదిగ పల్లె నివాసులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుదీప దఅష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఎంపీడీవో వెంటనే స్పందించి కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. క్షేత్రస్థాయి అధికారులు స్పందించి సమస్యకు వెంటనే పరిష్కార మార్గం చూపారు. ఆ క్రమంలోనే గత రెండు రోజులుగా శానిటేషన్ పనులు ముమ్మరంగా కార్యదర్శి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. మాదిగపల్లి నివాసులు గ్రామపంచాయతీ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
