గొల్లగూడెంలో శానిటేషన్‌ పనులు

Jul 12,2024 11:49 #Gollagudem, #Sanitation works

వి.ఆర్‌.పురం (అల్లూరి) : వర్షాలు కురవడంతో … మండలంలోని రేఖపల్లి పంచాయతీ గొల్లగూడెం గ్రామంలో శుక్రవారం రోజున సర్పంచ్‌ ఆధ్వర్యంలో శానిటేషన్‌ పనులు చేశారు. గ్రామంలో వర్షపు నీటిలో దోమకాటు ఎక్కువవుతుందని, దానివల్ల వచ్చే వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు జాగ్రత్తగా శానిటేషన్‌ పనులు చేపట్టినట్లు స్థానిక సర్పంచ్‌ పూనెం.సరోజినీ తెలిపారు. ప్రజలు కూడా ఇళ్ల చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమకాటును నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం.సత్యనారాయణ, పంకు.సత్తిబాబు, సిపిఎం సీనియర్‌ నాయకులు పంకు.శ్రీరామ్‌ మూర్తి, వార్డు మెంబర్లు కృష్ణవేణి, కట్టం లక్ష్మి, సచివాలయం సిబ్బంది, సెక్రటరీ శివప్రసాద్‌, ఇంజనీరింగ్‌ తరుణ్‌, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️