రామన్నగూడెంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు

తాడేపల్లిగూడెం రూరల్‌ (పశ్చిమ గోదావరి) : మండలంలోని రామన్నగూడెం గ్రామంలోని వినాయకుడి గుడివద్ద సంక్రాంతి సంబరాలు ఆది, సోమవారాల్లో బోణం యశస్విని ఆధ్యర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలి రోజు గొబ్బిళ్లు డాన్స్‌ ,ఫ్యాషన్‌ షో,డాన్స్‌ పోటీలతో మొదలుపెట్టి రెండవ రోజు ముగ్గుల పోటీ, మ్యూజికల్‌ చైర్స్‌ పోటీలతో సంబరాలను ముగించారు. గ్రామంలోని మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గన్నారు.చిన్నారులకు భోగిపళ్లు వేడుకను జరిపారు. ఆయా పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, ప్రత్యేక బహుమతులను, పాల్గొన్నవారికి ప్రోత్సాహక బహుమతులను ఊరి పెద్దల చేతుల మీదుగా అందజేశారు.ఊరి పెద్ద పాలడుగుల రత్నాజీరావుని ఈ సందర్భంగా శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించినట్లు ఈ వేడుకల నిర్వహాకులు బోణం గణేష్‌ తెలిపారు. కాగా ఇలాంటి వేడుకల వల్ల గ్రామాల్లో మన తెలుగువారి సంప్రదాయాలు భావి తరాలకు చేరువవుతాయని, కావున ప్రతి ఏటా తప్పనిసరిగా సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని ఊరి పెద్దలు అకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మద్దిపాటి సత్యనారాయణ మాస్టారు, మద్దిపాటి నాగేశ్వరరావు, బోణం సుబ్బారావు, ముళ్లపూడి వీరాస్వామి, మద్దిపాటి రంగారావు, గ్రామస్థులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.

➡️