ప్రజాశక్తి – గణపవరం : గణపవరం డిగ్రీ కాలేజీలో గురువారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజీ ప్రిన్సిపాల్ పి నిర్మలాకుమారి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సకల సౌభాగ్యాలను కలుగజేసే రైతన్నను మరిచి పోకూడదని అన్నారు. రైతులు కష్టాన్ని గుర్తు పెట్టుకోని వారిని అన్నిరకాల ఆదరించాలని అన్నారు. సంబరాలలో భాగంగా భోగి మంటను ఏర్పాటు చేశారు. ఎన్ ఎస్ ఎస్ యూనిట్ రెండవ పిఓ భాస్కారావు భోగి మంటల విశిష్టతను విద్యార్థులుకు వివరించారు. ఈ సంబరాలకు విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణ లో వచ్చి అందరిని ఆకుట్టుకున్నారు. అనంతరం జరిగిన ఆటలు పోటిలలో గెలుపొందిన వారికి ప్రిన్సిపాల్ నిర్మలాకుమారి బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు సిహెచ్ చైతన్య, టి అక్కి రాజు కె స్వ రూ ప రాణి , కె వి గణేష్ కుమర్ , పి బా స్కా రావు , రాణిదుర్గా, వెంకన్నబాబు పివి రమేష్, పిడి స్వాతి విద్యార్థులు పాల్గొన్నారు.