గ్రామ పంచాయతీలకు నిధుల విడుదలపై సర్పంచుల హర్షం

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌ (కోనసీమ) : గతంలో హామీ ఇచ్చిన విధంగా గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.250 కోట్లు విడుదల చేసినందుకు రాష్ట్రంలోని 12,918 మంది గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు హర్షం వ్యక్తం చేశారు. శనివారం అమలాపురం నియోజకవర్గం సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు పెద్దిరెడ్డి రామచంద్రారావు (రాము) గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు కి అలాగే పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌, ఆర్థిక శాఖామంత్రులు పయ్యవుల కేశవ్‌, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షులు వై.వి. బి రాజేంద్రప్రసాద్‌, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర కమిటి ప్రతినిధులకు కఅతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజల అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు.గత ఐదు సంవత్సరాలుగా వివిధ పద్దుల కింద జగన్‌ ప్రభుత్వం దొంగిలించి దారి మళ్లించిన వేల కోట్ల నిధులను కూడా ఇప్పించవలసినదిగా ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా ఆయన కోరారు. అలాగే గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి సర్పంచులకు ఉండవలసిన హక్కులు, విధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని రాము కోరారు.

➡️