వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో రన్నర్‌గా సత్య డిగ్రీ కళాశాల

Nov 5,2024 21:21

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ఆంధ్ర యూనిర్సిటీ అంతర కళాశాలల వెయిట్‌ లిఫ్టింగ్‌ ఉమెన్‌ పోటీల ఛాంపియన్‌షిప్‌లో సత్య డిగ్రీ, పీజీ కళాశాల రన్నర్‌గా నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవి సాయిదేవ మణి తెలిపారు. ఈ పోటీలు విశాఖపట్నం బుల్లయ్య కాలేజ్‌ లో ఈనెల 2న జరిగాయి. ఈ పోటీల్లో ఎ.యశశ్రీ 64కేజీల విభాగంలో (స్నాచ్‌) బంగారు పతకం, ఎస్‌.పల్లవి 71 కేజీల విభాగంలో (స్నాచ్‌) బంగారు పతకం, బి.నీరజ 45 కేజీల విభాగంలో (స్నాచ్‌) బంగారు పతకం, ఆర్‌. రాంబాబు96 కేజీల విభాగంలో (స్నాచ్‌) బంగారు పతకం, ఎ.లిఖిత్‌ 67కేజీల విభాగము లో (స్నాచ్‌) రజిత పతకం సాధించారని తెలిపారు. వీరంతా నవంబర్‌ మూడవ వారంలో జరగబోయే సౌత్‌ వెస్ట్‌ జోన్‌ అంతర్‌ యూనివర్శిటీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల సంచాలకులు డాక్టర్‌ ఎం.శశిభూషణరావు అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ఎన్‌సిసి ఆఫీసర్‌ ఎం.ఉదరు కిరణ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ బి.సూరపు నాయుడు, ఫిజికల్‌ డైరెక్టర్లు మహేష్‌, ప్రసాద్‌, కోచ్‌ చల్లారాము పాల్గొన్నారు.

➡️