ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : మతాలకతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి సావిత్రిబాయి పూలే అని బిసి ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి నాయుడు కొనియాడారు. ఆదివారం ఆదోనిలోని బిసి ఫెడరేషన్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. దస్తగిరి నాయుడు మాట్లాడుతూ ఆధునిక విద్య ద్వారా స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని ఆమె నమ్మారన్నారు. మహిళల హక్కుల కోసం మాత్రమే కాకుండా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ సలహాదారుల ధణా పురం శేషనన్న, తాలూకా ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ షావలి, సలహాదారులు బి రాముడు, కపటి వీరభద్ర పట్టణ సలహాదారులు, అడ్వకేట్ వి.రామాంజనేయులు, మల్లేశ్వరప్ప, డాక్టర్ సోమశేఖర్, నల్లారెడ్డి,ఆయిల్ ప్రకాష్, కత్తి ప్రసాద్, కళ్యాణ్ పాల్గొన్నారు.
