సావిత్రిబాయిపూలే వర్థంతి

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనమాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నరసాపురం పట్టణంలో భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే 128 వ వర్ధంతి నిర్వహించారు. ముందుగా సావిత్రి బాయి పూలే కు ఘనానివాళులు అర్పించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు వనమాల శ్రీనివాసరావు జాతీయ బిసి సంక్షేమ సంఘం నరసాపురం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు గా వాకా వరలక్ష్మి ని నియమించారు. ఈ కార్యక్రమం లో వనమాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే అగ్రవర్ణ ఆధిపత్య కట్టుబాట్లు ను దిక్కరించి అట్టడుగు వర్గం బాలికలను విద్యావంతులు గా చెయ్యటంలో ఆవిడ చేసిన కృషి గురించి ఎనలేనిది అన్నారు.ఈ కార్యక్రమం లో రేవు శ్రీనివాస్‌ రాష్ట్ర ప్రచారకమిటి చైర్మన్‌ ఆముదలపల్లి వెంకటాచార్యులు, జిల్లా అధ్యక్షులు సందక రామకృష్ణ, కోప్పాడ సత్యనారాయణ, కట్టుంగా నరేష్‌,సంఘాని వెంకటేశ్వరరావు, పట్నాల రమేష్‌, దేశంశెట్టి సత్యనారాయణ, వరద రామలింగేశ్వరరావు, రాజులపూడి సుధీర్‌, మీసాల రాము, మోకా శంకర్‌, కోలా కనకరాజు, పాలవలస వెంకటేశ్వరావు,వాకలపూడి అప్పారావు, కొమ్ము వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

➡️