ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : ఇచ్చిన మాటకు కట్టుబడి ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మండపేట లో మీడియాతో మాట్లాడుతూ రెండు దశాబ్దాల పోరాటం ఇన్నాళ్లకు నెరవేరిందన్నారు. మాదిగ ల కోసం సుధీర్ఘ పోరాటం చేసిన మాదిగ జాతి ముద్దు బిడ్డ మందకఅష్ణ మాదిగకు, ఇచ్చిన మాటకు కట్టుబడి మాదిగల కల నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఇందుకు అవసరమైన సహకారాన్ని అందించిన ప్రధాని నరేంద్ర మోడీ కి యావత్ మాదిగ జాతి రుణపడి వుంటుందన్నారు. మొదటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయం వైపు నిలబడి మాదిగలకు కొండంత అండగా నిలిచారన్నారు. తమ జాతి ఆకాంక్షను నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి శిరస్సు వంచి కఅతజ్ఞతలు తేలియజేస్తున్నట్లు చెప్పారు.
