ప్రజాశక్తి-బత్తలపల్లి (అనంతపురం) : మండల కేంద్రమైన బత్తలపల్లిలోని ఎస్సి వర్గీకరణతో నాలుగు రోడ్ల కోడలు కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు దండోరా లక్ష్మన్న మాట్లాడుతూ … 30 ఏళ్ల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అంశమని ఎమ్మార్పీఎస్ నాయకులు కేసుగాల వెంకటేష్ పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న సందర్భంగా వారు బత్తలపల్లి కూడలి నందు కేక్ కటింగ్ చేసి తర్వాత బత్తలపల్లి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి అంబేద్కర్ గ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల వర్ధిల్లాలి నినాదాలు చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బత్తలపల్లి ఎంఆర్పిఎస్ నాయకులు లక్ష్మన్న, రైతు సంఘం జిల్లా ప్రెసిడెంట్ కమతం కాటమయ్య, ఎస్ సి జన సంఘం రాష్ట్ర ఇంచార్జి మాలవంతం రామ్ ప్రసాద్, ధర్మవరం బిఎస్పి ఇంచార్జి సాకే వినరు కుమార్, బేడా బుడగ జంగం బాల కుళ్లాయప్ప, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్‌సి వర్గీకరణ సాధించడం హర్షణీయం : ఎమ్మార్పీఎస్ నాయకులు
