ప్రజాశక్తి-తాళ్ళూరు: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న పేద ప్రజల కోసం అమలు చేసిన పథకాలన్నీ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచే పల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి తాళ్లూరు మండలం గుంటి గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా వైసీపీ మండల కమిటీ, తురకపాలెం వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ, ఒంగోలు పార్లమెంటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి ప్రభలపై ప్రసంగిం చారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ చంద్ర బాబునాయుడు అబద్ధాలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు అమలు చేయలేక ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పుతూ మోసం చేస్తున్నారని విమర్శిం చారు. రైతు భరోసా, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద వంటి పథకాలను అమలు చేయలేదని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా సినీనటి హెబ్బా పటేల్ అందరినీ ఆకర్షించింది. పాటకచేరీలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తుమ్ము సుబ్బారెడ్డి, కాకల కష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదనరెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, సర్పంచులు సుబ్బారావు, వలి, నాయకులు జయరాంరెడ్డి నాగిరెడ్డి, ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
