ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెంట్ అవార్డు 2023-24కు ఎంపికైనట్లు ఆపాఠశాల ప్రధానో పాధ్యాయులు డివిఎస్.ప్రసాద్ తెలిపారు. క్రీడలలో ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు ఈ అవార్డు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత విద్యా సంవత్సరంలో క్రీడాకారులు చూపిన ప్రతిభ ఆధారంగా ఐదు పాఠశాలలను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. అందులో పాకల పాఠశాల ఒకటని ఆయన తెలిపారు. గత మూడు సంవత్సరాల్లో రెండుసార్లు పాకల పాఠశాల ఈ అవార్డుకు ఎంపిక కావడం వ్యాయామ ఉపాధ్యాయుడు హజరత్తయ్య నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయుడు హజరత్తయ్యను అభినం దించారు. ఈ సందర్భంగా హజరత్తయ్య మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను పెంచినట్లు తెలిపారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా శిక్షణ ఇస్తానని ఆయన తెలిపారు.
పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెంట్ అవార్డు
