స్కూటీ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌: స్కూటీ అదుపుతప్పి యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన మంగలిపాలెం డొంక వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది కథనం ప్రకారం మార్టూరు సమీపంలోని ఇసుక దర్శి పాండురంగ స్వామి ఆలయం వద్ద డాబా హౌటల్‌లో పనిచేస్తున్న ఒరిస్సా కార్మికులు టూనా, బఫున్‌ హౌటల్‌ పని మీద చిలకలూరిపేటకు వెళ్లి తిరిగి మార్టూరు వస్తున్నారు. ఈ క్రమంలో లక్కీ రోడ్‌ లైన్స్‌ వద్ద స్కూటీ ఒక్క సారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో టూనా తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. బఫున్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను గుంటూరు సర్వజన సమగ్ర వైద్యశాలకు తరలించారు.

➡️