ఫొటో : ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.వెంకటేశ్వర్లు
ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు డివిజన్ పరిధిలోని సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆత్మకూరు ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పట్టణంలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం సామగ్రిని సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఇఇ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో 59 సాగునీటి సంఘాలు 25,704 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఉదయగిరి, సీతారాంపురం మండలాల్లో 34 సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. గండిపాలెం ప్రాజెక్టు ఎన్నికల సైతం ఎన్నికలతో కలిపి నిర్వహించినట్లు తెలిపారు. అన్ని సాగునీటి సంఘాల ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. 14వ తేదీ ఆయా సాగునీటి సంఘాల పరిధిలో ఎన్నికలు జరగనున్నట్లు ఆరోజు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. ఆయా మండలాల తాసిల్దార్లు , ఎలక్షన్ ఆఫీసర్లు, పిఒలు, ఎపిఒలు ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకొని ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల సామాగ్రిని ఆయా సాగునీటి సంఘాల పరిధిలోని మండలాలకు చేరుతున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ సిబ్బంది, ఉన్నారు.