ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విద్యుత్ ఉద్యోగులతో విద్యుత్ భద్రత ప్రతిజ్ఞ ఎపి ఈ పి డీ ఈ ఎల్ సూపరెండెంట్ ఇంజినీర్ ఎస్ .లక్ష్మణరావు బుధవారం కార్యాలయం ఆవరణలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ ఆంధ్ర ప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగినైన నేను, నా విధి నిర్వహణలో భాగంగా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, నాకు నేను పునరంకితం అవుతానని, దానిలో భాగంగా నేను మరియు నా తోటి ఉద్యోగులు పని చేసే ప్రదేశాలలో భద్రతా పరికరములను (ఎర్త్ రాడ్స్, హెల్మెట్, గ్లాసు, సేఫ్టీ బూట్స్, సేఫ్టీ బెల్టు మొదలగునవి) భారంగా కాకుండా బాధ్యతగా ఉపయోగించుటకు నా వంతు కఅషి చేస్తానని ధఅవీకరిస్తున్నాను. ఇక నుండి నేను పని చేస్తున్న కార్యాలయ పరిధిలో విద్యుత్ ప్రమాదాల వలన గాయపడటం లేదా ప్రాణం పోవు సంఘటనలు జరగకుండా ఉండుటకు త్రికరణశుద్ధిగా కఅషి చేయుదునని తద్వారా విద్యుత్ ప్రమాదరహిత కార్యాలయంగా నిలుపుదునని ప్రతిజ్ఞ చేయచున్నాను. అని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో ఈ ఈ త్రినాధరావు, ఎడిఈ కిరణ్ కుమార్ ఉద్యోగులు పాల్గొన్నారు.