తిరుపతి : స్టార్ హోటల్లో సీలింగ్ కూలిన ఘటన మంగళవారం తిరుపతిలో జరిగింది. హోటల్ గ్రాండ్ రెస్టారెంట్ అండ్ బార్ అండ్ హోటల్ లోని మినర్వా గ్రాండ్ రూమ్ నెంబర్ 314 గదిలో ఒక్కసారిగా సీలింగ్ కుప్పకూలింది. దీంతో ఆ గదిలో ఉన్న యాత్రికులంతా వెంటనే భయాందోళన చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
