సముద్రంలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగింపు

శింగరాయకొండ (ప్రకాశం) : శింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో గురువారంనాడు సరదాగా సముద్ర తీరానికి వచ్చి గల్లంతైన తమ్మిశెట్టి పవన్‌ ఆచూకీ శుక్రవారం ఉదయం వరకు తెలియలేదు. ఈరోజు ఉదయం తహశీల్దార్‌ టి.రవి, ఎస్సై బి.మహేంద్ర, సర్పంచ్‌ సైకం.చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో మెరైన్‌ పోలీసులు, మత్స్యకారులు రెండు బోట్ల సహాయంతో పవన్‌ కోసం గాలించడానికి సముద్రంలోకి వెళ్లారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు పవన్‌ కుటుంబ సభ్యులు పవన్‌ మిత్రులు సముద్రం వద్దే ఎదురుచూస్తున్నారు.

➡️