ఉంగుటూరు (ఏలూరు) : ఉంగుటూరు మండలం నారాయణపురం వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని నలుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటి లో సీటు పొందారు. గోపిశెట్టి రవితేజ, పొన్నాడ పవన్, నక్క బాల శివసాయి, పాలపర్తి సూర్య దీపిక, మొత్తం నలుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీ లో సీట్లు సాధించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
