సారాబట్టిలపై ఎస్ఈబి దాడులు.. 500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

Feb 11,2024 16:08 #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు(అంబేద్కర్‌ కోనసీమ) : సారా తయారీ కేంద్రంపై ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించి 500 లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్‌ఈబీ సీఐ ఎం.ఏ.ఖదీర్‌, ఎస్సై ఏ.సత్యవాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి నది పరివాహక ప్రాంతంలో సారా తయారీ చేస్తున్నారన్న సమాచారంతో అంగర ఎస్‌ఐ పరదేశి, ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బంది కలసి ఆకస్మిక దాడి చేశారిన.. ఈదాడిలో సారా తయారీకి సిద్దంగా ఉన్న 500 లీటర్లు బెల్లపు ఊటను స్వాధీనం చేసుకుని ద్వంసం చేసినట్లు తెలిపారు. నిర్వాహకుడు కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. సారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములను, వంట పాత్రలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు ఆలమూరు ఎస్‌ఈబి స్టేషన్‌ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ఖాధిర్‌ తెలిపారు. ఎస్‌ఈబీ పరిధి ఆలమూరు కపిలేశ్వరపురం మండపేట మండలాల్లో ఎవరైనా సారా తయారీకి పాల్పడితే సమాచారం సిఐ ఫొన్‌ నెంబరు 6300782575, ఎస్‌ఐ నెంబరు 9959841282 లకు తెలియజేయాలని ఆయన కోరారు. ఇందుకు భిన్నంగా ఎవరు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

➡️