స్ట్రాంగ్‌ రూముల్లో భద్రంగా ఇవిఎంలు

May 14,2024 22:18

ప్రజాశక్తి-విజయనగరంకోట  : ఓటింగ్‌ ప్రక్రియ ముగియడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇవిఎంలను స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచారు. లెండి ఇంజనీరింగ్‌ కళాశాలలో చీపురుపల్లి, రాజాం, నెల్లిమర్ల, ఎస్‌.కోట, గజపతినగరం నియోజకవర్గాల ఇవిఎంలను, జెఎన్‌టియు గురజాడ విశ్వవిద్యాలయంలో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఇవిఎంలను భద్రపరిచారు. జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి, ఆయా నియోజకవర్గాల సాధారణ ఎన్నికల పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా పర్యవేక్షణలో, నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఇవిఎం స్ట్రాంగ్‌ రూమ్‌లకు సీళ్లు వేశారు. స్ట్రాంగు రూములవద్ద సిసి కెమేరాలు, బారికేడింగ్‌, పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటికి సమీపంలోనే కౌంటింగ్‌ హాళ్లను సిద్దం చేసి, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేయనున్నారు.

➡️