గాజువాక (విశాఖ) : ఆటోనగర్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ దుర్గారావు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దుర్గారావు కుటుంబానికి న్యాయం చేయాలని కంపెనీ గేటు దగ్గర సోమవారం ఉదయం ఆందోళన చేపట్టారు. సెక్యూరిటీ గార్డు ఒంటిపై రక్తపు మరకలున్నట్లు గాజువాక పోలీస్ స్టేషన్ కు బంధువులు సమాచారమిచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
