కంచికచర్ల (ఎన్‌టిఆర్) : కంచికచర్ల మండలం పరిటాల గ్రామ శివారులో శ్రీ లక్ష్మీ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 600 బస్తాల రేషన్ బియ్యాన్ని కంచికచర్ల ఎస్సై బోనగిరి రాజు సీజ్ చేశారు. కార్డుదారుల నుండి ఈ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి భారీ నిల్వలు ఉంచి వీటితోపాటు వరద బాధితులకు ఇచ్చిన రేషన్ బియ్యం కూడా అక్రమంగా రవాణా చేయటానికి సిద్ధంగా ఉండగా సమాచారం తెలుసుకున్న ఎస్సై రేషన్ బియ్యం నిల్వపై దాడులను నిర్వహించి ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఈ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సాంబమసురు బియ్యం లో కలిపి భారీ అమ్మకాలు జరుగుతున్నట్లుగా పోలీసులు విచారణలో బయటపడింది.
