ఇసుక లారీలు పట్టివేత

Nov 13,2024 00:53

ప్రజాశక్తి – అమరావతి : మండంలోని దిడుగులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీలను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. దిడుగు ఇసుక రీచ్‌ నుండి అనుమతులేమీ లేకుండా రాత్రి వేళల్లో ఇసుక తరలింపు కొద్దిరోజులగా సాగుతోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సిఐ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇసుకను తరలిస్తున్న 11 లారీలను ఆపి పరిశీలించగా అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

➡️