జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

ప్రజాశక్తి-దర్శి : దర్శి మండలం చంద్రలూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి వై. దయాసాగర్‌ జాతీయస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీగంథం గురుప్రసాద్‌ బుధవారం తెలిపారు.బాపట్ల జిల్లా రేపల్లెలో 26,27,28 తేదీల్లో రాష్ట్ర స్థాయి బాలుర విభాగంలో హ్యాండ్‌ బాల్‌ పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ పోటీల్లో 26 జిల్లాల నుంచి టీములు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీల్లో ప్రకాశం జిల్లా జట్లు మూడవ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా జట్టు తరపున పాల్గొన్న దయాసాగర్‌ ప్రతిభ చూపి జాతీయ జట్టుకి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. జార్ఖండ్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో దయాసాగర్‌ పాల్గొనున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన దయాసాగర్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీగంథం గురు ప్రసాద్‌, పీడీ సోము అంజిరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.

➡️