రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ప్రజాశక్తి – చీరాల: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో జరిగే ఆటల పోటీలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టుకు కొత్తపేట జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం జి.శ్రీనివాసరావు తెలిపారు. బేస్‌ బాల్‌ అండర్‌ 17 పోటీలలో కె.ఏసోబు, ఓ.ప్రసాద్‌, ఎస్‌.శ్రావణి, బేస్‌బాల్‌ అండర్‌ 14 విభాగంలో ఎన్‌.జయచంద్రిక, ఇ.వెంకా యమ్మ, అదేవిధంగా అండర్‌ 14 బాలికలు రన్నింగ్‌లో ఎమ్‌.రేఖ ఎంపికయ్యారని తెలిపారు. హైస్కూల్‌ విద్యార్థులు వివిధ క్రీడలకు ఎంపిక అవటం పట్ల పాఠశాల డెవలప్‌మెంట్‌ కమిటీ అధ్యక్షులు గవిని నాగేశ్వరరావు, ఎస్‌ఎంఎస్‌ చైర్మన్‌ విజయ విక్టోరియా రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు సీతా దేవి హనుమంతరావు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అబి óనందించారు. రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి పాఠశా లకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

➡️