ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాల బాలికల హాకీ జిల్లా జట్ల ఎంపికలు గురువారం జరిగాయి. ఈ ఎంపికలకు జిల్లాలోని పలు హైస్కూళ్ల నుంచి 190 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు పీఈటీ తిరుమలశెట్టి రవికుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు త్వరలో వివిధ జిల్లాలలో జరగబోయే రాష్ట్రస్థాయి టోర్నమెం ట్లలో పాల్గొంటారని ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ కే వనజ తెలిపారు. ఎంపిక సందర్భంగా క్రీడలను చీమకుర్తి జవహర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బంధ రాకేష్ ప్రారంభించారు. ముగింపు కార్యక్రమంలో పమిడి రవితేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రధానోపాధ్యాయులు డీవిఎల్ నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డైట్ లెక్చరర్స్ శ్రీనివాసులు, రవీంద్ర, విద్యా కమిటీ చైర్మన్ బ్రహ్మయ్య, డైట్ సూపరింటెండెంట్ జగన్, సీహెచ్ వెంకటేశ్వర్లు, ఓబుల్ తదితరులు పాల్గొన్నారు.
