జాతీయ స్థాయి పోటీలకు గిరిజన విద్యార్థిని ఎంపిక

Nov 28,2024 21:19

ప్రజాశక్తి – సీతంపేట : జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు స్థానిక బాలికల గురుకుల పాఠశాలకు చెందిన హెచ్‌.లక్షహిత ఎంపికైనట్లు రాష్ట్ర గిరిజన స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌, ఐటిడిఎ స్పోర్ట్స్‌ ఇంచార్జ్‌ జాకబ్‌ దయానందం తెలిపారు. జన జాతీయ గౌరవ దివస్‌ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల టిసిఆర్‌, టిఎం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. శుక్రావరం కేరళలోని వయనాడ్‌ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. ఈమేరకు లక్షహితను ఐటిడిఎ పిఒ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఎపిఒ చిన్నబాబు, పాఠశాల ప్రిన్సిపల్‌ అరుణజ్యోతి, తల్లిదండ్రులు అభినందించారు.

➡️