ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ (తిరుపతి) : 14 సంవత్సరాలు లోపు పిల్లలను పనిలోకి పెట్టుకుంటే బాల కార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకున్న పడుతుందని. పుత్తూరు సీనియర్ సివిల్ జడ్జి ఎస్ సి రాఘవేంద్ర. తెలిపారు. బుధవారం ఆపరేషన్ స్వేచ్ఛ. లో భాగంగా. బాల కార్మికులను పనిలోకి పెట్టుకోకూడదని. కోర్టు సిబ్బందులు. పుత్తూరు కార్మిక శాఖ అధికారి హేమాచారి. కలిసి. హౌటల్. వెల్డింగ్ షాపులు వాణిజ్య సమాదాయంలో కానీ పనులోకి పెట్టుకోకూడదని. న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర. మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు హౌటల్లో వెల్డింగ్ షాపుల్లో, ఇతర దుకాణాల్లో, వాణిజ్య సముదాయ లో. 14 సంవత్సరాలు తక్కువగా ఉన్న చిన్నపిల్లలను పనిలోకి పెట్టుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న పడుతుందని అన్నారు అలా కాదని ఎవరైనా పనిలో పెట్టుకుంటే దుకాణ యజమానిపై చర్యలు తీసుకొని పడుతుందని వారికి జరిమాణం ఉంటాయని, దుకాణ యాజమాన్యం వారికి అవగాహన కల్పించారు. అదేవిధంగా ఐసీడీఎస్ ఇబ్బందులు. కార్మిక శాఖ అధికారులు కలిసి పట్టణంలో దుకాణాలపై తనిఖీలు చేపట్టడం యజమానులకు అవగాహన కల్పించారు. బడి ఈడు పిల్లలను బడికి పంపాలని. తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ సిబ్బందులు, కోర్టు సిబ్బందులు పాల్గొన్నారు
బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు : సీనియర్ సివిల్ జడ్జి ఎస్‌సి.రాఘవేంద్ర
