ప్రజాశక్తి – కడప : ఈనెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు అనంతపురంలోని కళ్యాణదుర్గంలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ హాండ్ బాల్ పోటీలలో పాల్గనే కడప జిల్లా హ్యాండ్ బాల్ జట్టు ను బుధవారం కడప జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి వి. వి. శివప్రసాద్ ప్రకటించారు. కడప నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం మైదానంలో జిల్లా అసోసియేషన్‌హొ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎంపికల్లో జిల్లా నలుమూలల నుండి 50 మంది క్రీడాకారులు పాల్గన్నారు. ఇందులో మంచి ప్రతిభ కనబరచిన క్రీడాకారులను జిల్లా హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపిక చేసినట్లు కడప జిల్లా హాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి వి.వి. శివప్రసాద్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే జిల్లా జట్టుకు ఎంపికైన వారిలోహొ ఎస్. చాంద్ బాషా, ఎం. ప్రతాప్, ఎస్. అక్బర్, సి. మల్లికార్జున, ఎస్. నాగేంద్ర, ఎం. గురువర్ధన్, ఎస్. రజాక్, కె.వి. శివకుమార్, బి. కిషోర్, బి. శివ, టి. లింగ, బి. జై రామ్, ఎన్. రాజు, బి. హుస్సేన్, పి. సురేంద్ర, పి. నాగరాజు జిల్లా హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నట్లు తెలిపారు . స్టాండ్ బైలుగా బి. మళ్లీ ఎంపికైనట్లు తెలిపారు.