సీనియర్‌ జర్నలిస్ట్‌ సుదర్శనరావు గుండెపోటుతో మృతి

Jun 11,2024 13:31 #died, #heart attack, #Senior journalist

ప్రజాశక్తి-కాజులూరు (కాకినాడ) : సీనియర్‌ జర్నలిస్ట్‌ , పూర్వపు ప్రజాశక్తి జర్నలిస్ట్‌ సుదర్శన్‌ రావు (55) మంగళవారం వేకువ జామున గుండెపోటుతో మృతి చెందారు. సుదర్శన్‌ రావుకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. చేదువాడ గ్రామంలో ఆయన స్వగృహం వద్ద సుదర్శన్‌ భౌతికకాయానికి పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుదర్శన్‌ 28 సంవత్సరాలుగా పత్రికా రంగంలో సేవలు అందిస్తున్నారు. బంధనపూడి సర్పంచ్‌ డేగల తిరుమలవేణి కుమారుడు నాగేంద్ర అంత్యక్రియల నిమిత్తం ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. రామచంద్రపురం ఎమ్మెల్యే సుభాష్‌ తండ్రి సత్యం, నియోజకవర్గ ఎలక్ట్రానిక్‌ మీడియా అసోషియేషన్‌ అధ్యక్షుడు కె.కనకరత్నం, కార్యదర్శి జి.పఅద్విరాజ్‌, అధ్యక్షుడు కె.భీమ శంకరం ఉపాధ్యక్షుడు కె.రమేష్‌ ,చందాల బాబీ ,తాడి వెంకట రెడ్డి, తదితర విలేకరులు పాల్గొన్నారు.

➡️