విభజన హామీలు అమలు చేయాలి : డివైఎఫ్‌ఐ

ప్రజాశక్తి-బద్వేలు రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన ప్రధాన మంత్రి మోడీ రాష్ట్ర పర్యటనకు రావడం సిగ్గుచేటని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని అన్నారు. బుధవారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సిద్ధవటం రోడ్డులోని భగత్‌ సింగ్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివద్ధి పనుల ప్రారంభోత్సవం పేరుతో రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2014 ఎన్నికలకు ముందు విభజన హామీలను అమలు చేస్తామన్న హామీతో బాబు మోడీల జోడి ప్రజల ముందుకు వచ్చి అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత 11 ఏళ్లు అయినా హామీలు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. నాడు రాజధాని శంకుస్థాపన కోసమని వచ్చి చెంబుడు నీళ్లు పిడికెడు మట్టి వేసి వెళ్ళారని, హామీలు అమలు చేయకుండా ఇంకెన్నెళ్లు మోసం చేస్తారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదిగిన విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టి, ప్రయివేట్‌ కార్పొరేట్ల ఆదాయ వనరు కోసం ఏకంగా మూసివేతకు ప్లాన్‌ వేసిందన్నారు. విశాఖ ఉక్కు రక్షణ పట్ల స్పష్టత ఇవ్వాలన్నారు. వెనకబడ్డ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివ ద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి ప్రాజెక్టులు నిర్మించాల్సిన పాలకులు ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మించలేదన్నారు. తిరిగి నేడు కూటమి ప్రభుత్వంలో భాగంగా చంద్రబాబు మోడీలు జోడిగానే ఉన్నారని, రాష్ట్ర వెనుకబాటు తనానికి సంబంధించి చంద్రబాబు కూడా సమాధానం చెప్పాలన్నారు. రూ.142 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి రూ.165 లక్షల కోట్ల అప్పులు పెట్టి దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. చేసిన అప్పు అంత ఏ అభివ ద్ధి కోసం ఖర్చు చేశారో ప్రజానీకానికి సమాధానం చెప్పాలన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, వలసల నియంత్రణ లాంటి వాటిపై ద ష్టి పెట్టకుండా మాటల గారడీ మాకొద్దని ముక్తకంఠంతో మీ రాకను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర అభివద్ధిపై దష్టి సారించకపోతే ప్రజలంతా ఐక్యంగా తిరగబడే రోజు మరెంతో దూరంలో లేదని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షులు షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌, కార్యదర్శి షేక్‌ ఆదిల్‌, పట్టణ నాయకులు సుధాకర్‌, ఇర్ఫాన్‌, హేమంత్‌, నాసర్‌, తేజ, యోగి, పథ్వి, నరసింహారాజు పాల్గొన్నారు.

➡️