ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గంలోని సర్పం చులను సమాన దృష్టితో చూడాలని యర్రగొండ పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం యర్రగొండపాలెం పట్టణంలోని ఆయ న క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధి లోని వైసీపీ సర్పంచులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ తమ గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. అయితే సమస్యను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు దష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తాము గ్రామ పంచాయతీల పరిధిలో చేసిన పనులకు పంచాయతీ కార్యదర్శులు బిల్లులు చేయ డం లేదన్నారు. దీంతో తాము పంచాయతీ పరిధిలో ఏదైనా పనులు చేయాలంటే బిల్లులు కావని భయమేస్తుం దన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్‌ను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. ప్రజలు ఎన్నుకోబడిన సర్పంచులను పార్టీలకు రాజకీయా లకతీతంగా అధికారులు అందరినీ సమాన దృష్టితో చూడా లన్నారు. వెంటనే వైసీపీ సర్పంచులు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని తెలిపారు. అలాగే నీటి సమస్య ఉన్న గ్రామాల్లో సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజలను ఆదుకోవాలని తెలిపారు. దీంతో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్, మాజీ ఎంపీపీ మోర్తాల సుబ్బారెడ్డి, పుల్లలచెరువు జడ్పిటిసి వాగ్యా నాయక్, సర్పంచ్‌లు ఏకుల ముసలారెడ్డి, కర్నాటి వెంకటేశ్వరరెడ్డి, తమ్మినేని సత్తిరెడ్డి, నాయకులు రాములు నాయక్, లింగం రవి, బిజ్జం రమణారెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, రోశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
