ప్రజాశక్తి – బేస్తవారిపేట: సర్వీస్ రోడ్డు పనులకు సహకరించాలని తహశీల్దార్ జితేంద్ర కుమార్ అన్నారు. పట్టణంలో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు విస్తరణ పనులుగురువారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారి అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న షెడ్లను స్వచ్ఛందంగా తొలగించాలని షాపు యజమానులకు సూచించారు. విస్తరణ పనులకు ఆటంకం కలగకుండా అందరూ సహకరించాలని కోరారు.
