మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు

May 14,2024 23:37 #Chalivendram
chalivendram

ప్రజాశక్తి – యంత్రారగం ఆరిలోవ : 12వ వార్డు పెదగదిలి శ్రీకృష్ణ యువజన సేవా సంఘం ఆధ్వర్యాన స్థానికుడు కడుపుకోట్ల అప్పారావు ప్రథమ వర్థంతిని పురస్కరించుకొని మంగళవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పాదచారులకు, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు. సీతమ్మధార : అక్కయ్యపాలెంలో ఎఐటియుసి ఆధ్వర్యాన చలివేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా 26వ వార్డు టిడిపి అధ్యక్షులు ముక్కా కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ, వేసవికాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైని ఉందన్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఈ చలివేంద్రాలు ప్రయాణికులకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️