నోడల్ అధికారిగా డిప్యూటీ కలెక్టర్ పి.మురళీ కృష్ణ
కలెక్టర్ బిఆర్ అంబేద్కర్
ప్రజాశక్తి-విజయనగరం లీగల్ : హై కోర్టు, జిల్లా కోర్టుల్లో ఫైల్ అయిన కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, కంటెంప్ట్‌లు పడకుండా అవసరమైన కౌంటర్లను వేయడానికి జిల్లా స్థాయి లీగల్ సెల్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర బిఆర్ అంబేద్కర్ తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ పి.మురళీ కృష్ణను నోడల్ అధికారిగా నియమిస్తూ సహాయకులుగా డిప్యూటీ తహశీల్దార్లను ఎం.ఉమా, సిహెచ్ రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ ఎ.శివసాయి కిరణ్‌ను, లైజన్ అధికారిగా టి.రామకృష్ణ, సూపరింటెండెంట్‌లను నియమించారు. జిల్లా కలెక్టర్ గురువారం తన ఛాంబర్ లో లీగల్ సెల్ సభ్యులతో సమావేశం నిర్వహించి పలు సూచనలను చేసారు. కోర్టు వెబ్‌సైట్‌లో ప్రతి రోజూ తనిఖీ చేసి జిల్లాకు సంబంధించి రెవిన్యూ, ఇతర శాఖలకు చెందిన కేసులేమైనా నమోదయ్యాయా, కోర్ట్ ఆర్డర్స్ పడ్డయా అనే విషయాలను తనిఖీ చేసి ప్రింట్ తీసి సంబంధిత శాఖలకు వెంటనే పంపాలని నోడల్ అధికారికి సూచించారు. కోర్ట్ ఆర్డర్స్ పడితే సంబంధిత అధికారులతో వెంటనే కౌంటర్ ఫైల్ చేసేలా చూడాలని, కంటెంప్ట్ కు అవకాశం ఇవ్వకూడదని తెలిపారు. ప్రతి శనివారం జిల్లా మొత్తం కేసుల వివరాలను తనకు సమర్పించాలని, సోమవారం పిజిఆర్‌ఎస్ లో హెచ్‌ఒడితో కేసుల పై సమీక్షిస్తానని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డిఆర్‌ఒ శ్రీనివాస మూర్తి, డిప్యూటీ కలెక్టర్ మురళీకృష్ణ, డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు.మెప్మా పీడీగా చిట్టిరాజు బాధ్యతలు స్వీకరణప్రజాశక్తి-విజయనగరంటౌన్‌మెప్మా పీడీగా జి.వి.చిట్టిరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాద పూర్వకంగా కలెక్టర్ ను ఛాంబర్ లో కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. చిట్టి రాజు శ్రీకాకుళం జిల్లా పలాస లో డిఎల్‌డిఒగా పని చేస్తూ బదిలీ పై జిల్లాకు వచ్చారు.